
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
జైనథ్: మండలంలోని నిరల గ్రామంలోగల త్రి నేత్ర ఫంక్షన్‌హాల్‌లో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ‘స్థానిక’ ఎన్నికల కార్యశాల నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నాయకులు పాయల్ శరత్, ఏండ్ల నాగేశ్, మయూర్ చంద్ర, బోయర్ విజయ్, సీతారాం, దత్తాత్రేయ, కరుణాకర్‌రెడ్డి, రాందాస్, రాకేశ్‌రెడ్డి, సీడం రాకేశ్, సత్యనారాయణ, రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
నేరడిగొండ: విద్యుత్ సమస్యలపై శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, బజార్‌హత్నూర్ మండలా ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరి ష్కారం కోసం పరిష్కార వేదిక నిర్వహించను న్నట్లు విద్యుత్ శాఖ అధికారి నాగేంద్రప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవా లని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.