
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూర్‌రూరల్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ రాజర్షి షా ఉట్నూర్ మండలం నాగపూర్ శివసాగర్ ప్రాజెక్ట్, పులిమడుగు బ్రిడ్జిని పరిశీలించారు. అతి భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారి విఠల్, డిప్యూటీ ఇంజినీర్ వినోద్, ఏఈలున్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ను సందర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేస్తున్న తీరు, నిల్వ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి యూరియా కొరత రా కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.