
వృత్తి శిక్షణతో ఉపాధి అవకాశాలు
ఆదిలాబాద్‌రూరల్: వృత్తి నైపుణ్య శిక్షణ పొందితే ఉ పాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ, షిరిడీ సాయి సేవా సొసైటీ సంయుక్తంగా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలోని భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, షిరిడీ సాయి సొసైటీ సంయుక్తంగా వృత్తి నైపుణ్య కేంద్రం నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కేంద్రాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, దళితాభివృద్ధి శాఖ అధికారి సునీతాకుమారి, షిరిడి సాయి సేవా సొసైటీ అధ్యక్షుడు, సాయిలింగి వృద్ధాశ్రమం నిర్వాహకుడు దెబ్బడి అశోక్, ఉపాధ్యక్షుడు నాలం అని ల్, ప్రధాన కార్యదర్శి శివన్న, కోశాధికారి దశరథ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.