
జీవో 49 నిలిపివేత హర్షణీయం
ఆదిలాబాద్‌రూరల్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేయడం హర్షనీయమని పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం మావలలోని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, సీతక్క, సురేఖ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఆదివాసీలకు ఇబ్బందులకు కలగకుండా చూసుకుంటామన్నారు. జీవో నిలిపివేతకు కృషి చేసిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, చంటి, ప్రఫూల్ రెడ్డి, కరుణకర్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ