
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది విధులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. పట్టణంలోని ప్రతీ వార్డుకు ఓ పోలీస్ అధికారిని కేటాయించాలని, వీపీవో విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఐని ఆదేశించారు. గంజాయి, పేకాట, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న స్థా నిక ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. స్టేష న్‌లో నమోదైన కేసుల దర్యాప్తు, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, పట్ట ణంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ప్రత్యే క కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సునిల్‌కుమార్, ఎస్సైలు నాగనాథ్, రమ్య తదితరులు ఉన్నారు.