
ఎఫెక్ట్..
‘స్వచ్ఛతలో.. పూర్’పై కలెక్టర్ ఆరా
● మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం
● నివేదిక అందించాలని కమిషనర్‌కు ఆదేశం
ౖకైలాస్‌నగర్: మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ అట్టడుగుస్థానంలో నిలిచింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ‘స్వచ్ఛతలో..పూర్ ’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. ర్యాంకుల్లో వెనుకబడటానికి గల కారణాలపై ఆరా తీశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గతి తప్పడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక అందజేయాలని కమిషనర్ సీవీఎన్. రాజును ఆదేశించారు.