
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి●
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలపై బా ధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 26 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఓపిగ్గా విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడా రు. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్ర జలు ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసుస్టేషన్‌లో, ఎస్పీ కార్యాలయంలో నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. దూరప్రాంతాల్లో ఉన్నవారు వాట్సాప్ నం.87126 59973పై సంప్రదించవచ్చని పేర్కొన్నారు.