
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఎలాంటి లింకు డా క్యుమెంట్ లేకుండా, పట్టాదారు కాకుండా మున్సిపల్ నుంచి అక్రమంగా ఇంటి నంబర్లు తీసుకుని కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశాం. కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. అలాగే ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసే ముందు లింకు డాక్యుమెంట్స్, పట్టా తప్పనిసరిగా పరిశీలించాలి.
– ఎల్.జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్