
టీపీడీఈఏ నూతన కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ పవర్ డిప్లొమో ఇంజినీర్స్ అసోసియేషన్ (టీపీడీఈఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోవర్ధన సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గన్ను జనార్దన్ రెడ్డి, కోశాధికారిగా భూషణవేణి వెంకటేశ్, ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శిగా కొమ్మటి మోహన్‌ప్రసాద్, కోశాధికారిగా వినయ్‌కుమార్, ఉట్నూర్ అధ్యక్షుడిగా జాదవ్ రోహిదాస్, కార్యదర్శిగా రాథోడ్ ఫృథ్వీరాజ్, ఆదిలాబాద్ కార్యదర్శిగా షిండే సాయికిరణ్, కోశాధికారిగా సుశాంత్, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా కాటం తిరుపతిరెడ్డి, జిల్లా సలహాదారుడిగా దేవుళ్ల శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా గోమాస అలివేణి ఎన్నికై నట్లు తెలిపారు.