
25న జాబ్‌మేళా
కైలాస్‌నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 25న ఉట్నూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్‌లో జాబ్‌మేళా కరపత్రాలను ఆవిష్కరించారు. ఉట్నూర్‌లోని జేసీఎన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10గంటలకు నిర్వహించనున్న మేళాకు జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, గిమ్మ సంతోష్, సామ రూపేష్ రెడ్డి, కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు.