
మంత్రి సీతక్కను కలిసిన ‘సోయం’
కైలాస్‌నగర్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మాజీ ఎంపీ సోయం బాపూరావు హైదరాబాద్‌లో ఆదివా రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27న ఆదిలాబాద్ లోని ఎస్టీయు భవన్‌లో నిర్వహించనున్న రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క సోయంను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెలే సక్కు, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, అక్కేపల్లి లక్ష్మణ్ తదితరులున్నారు.