
గ్ర ంథాలయాల అభివృద్ధికి కృషి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య
ఆదిలాబాద్: జిల్లాలోని ఆయా గ్రంథాలయాల్లో స మస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్‌గా సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల ప్రగతిని పట్టించుకోలేదన్నారు. త్వరలోనే జి ల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలను సందర్శించి, వాటి అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తామన్నా రు. స్థానిక దాతల సహకారంతో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టడీ మెటీరియల్ అందుబా టులో ఉంచుతామన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన మంత్రులతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు, ఉద్యోగులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, బోథ్‌వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, బోథ్, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్లు గొర్ల రాజు, అశోక్, కోటేష్, పసుల చంటి, టీఎన్జీవోఎస్ నాయకులు అశోక్, నవీన్, గ్రంథాలయఅధికారులు శ్రీనివాస్, సతీష్,నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనిపించని కార్యదర్శి..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన రోజునే సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.