
కేంద్ర మంత్రులకు వినతులు
ఆదిలాబాద్: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, హరదీప్ సింగ్‌ను ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలి శారు. ఆర్మూర్–నిర్మల్ రైల్వే మార్గానికి సర్వే పూర్తి చేయించి నిధులు విడుదల చేయాలని విన్నవించా రు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వే వంతెనలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. ఇంటింటికీ సహజవాయువు గ్యాస్ పైపులైన్ ఏర్పా టు చేయాలని, ద్విచక్ర వాహనాలకూ విద్యుత్ చా ర్జింగ్ పాయింట్ స్టేషన్లు నెలకొల్పాలని విజ్ఞప్తి చేశా రు. ఇందుకు కేద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వీరి వెంట బీజేపీ రాష్ట్ర నాయకుడు ముస్తాపూర్ అశోక్ ఉన్నారు.