
ముందస్తు టెండర్లు?
● ఎకై ్సజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు ● ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో గ్రామసభలు ● తీర్మానాలు సేకరిస్తున్న అధికారులు ● నవంబర్ వరకు గత షాపుల గడువు
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైన్‌షాపులకు ముందస్తు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో వైన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా పెసా యాక్ట్ ప్రకారం గ్రా మసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కు అనుకూలంగా తాజాగా ఎకై ్సజ్ కమిషనర్ నుంచి ఆ శాఖ జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఏజెన్సీ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తూ తీర్మానాలు సేకరించే పనిలో పడ్డారు. ఈనెల 27వరకు వాటిని కమిషనర్‌కు పంపించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వం వైన్‌షాపులకు ముందస్తు టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు లిక్కర్ వ్యాపారుల్లో చర్చ మొదలైంది.
తీర్మానాల సేకరణలో అధికారులు
రెండేళ్ల కిందట అంటే.. 2023 నవంబర్‌లో బీఆర్‌ఎస్ హయాంలో వైన్స్‌లకు సంబంధించి టెండర్లు నిర్వహించారు. వచ్చే నవంబర్‌లో వాటి కాలపరిమితి ముగియనుంది. అప్పట్లో బీఆర్‌ఎస్ సర్కార్ కూడా ఎన్నికలకు ముందే ముందస్తు టెండర్లు నిర్వహించింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా, ఈ టెండర్లు నిర్వహించడం ద్వారా ఔత్సాహికుల్లో లిక్కర్ షాప్ దక్కించుకోవాలనే పో టీ కనిపిస్తుందని, తద్వారా అధిక ఆదాయం లభి స్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో డీపీఈవోలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో గ్రామసభల ద్వారా అక్కడ వై న్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా తీర్మానాలు సేకరించే పనిలో పడ్డారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కమిషనర్ ఆఫీస్‌కు పంపించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఆదిలాబాద్‌లో ఉంది. ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంగా దీన్ని పిలుస్తారు. దీని పరిధిలో మొత్తం 192 వైన్స్‌లున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40, నిర్మల్‌లో 47, మంచిర్యాలలో 73, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 చొప్పున ఉన్నాయి. ఏటా సుమారు రూ.1,400 కోట్ల డిమాండ్ మేర మద్యం విక్రయాలు జరుగుతాయి.
తీర్మానాలు సేకరిస్తున్నాం
పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామసభల ద్వారా వైన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు తీర్మానాలు సేకరిస్తున్నాం. ఎకై ్సజ్ టెండర్లను ముందస్తుగా నిర్వహించే విషయంలో మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– హిమశ్రీ, డీపీఈవో

ముందస్తు టెండర్లు?