
క్షయకు ఎవరూ భయపడొద్దు
బేల: క్షయకు ఎవరూ భయపడొద్దని జిల్లా టీబీ అ ధికారి సుమలత సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భా గంగా స్క్రీనింగ్, టీబీ అనుమానిత కేసుల ఎక్స్‌రేల వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణకు ప్రభుత్వ ఆస్పత్రి లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, అతిసారా బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య వి ద్యపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీ హెచ్‌సీ వైద్యాధికారి వంశీకృష్ణ, ఎస్‌టీఎస్ రవీందర్, ఎస్వో గేడం నవీన, హెల్త్ సూపర్‌వైజర్లు కళావ తి, జాదవ్ అనిల్‌కుమార్, హెల్త్ అసిస్టెంట్ బాసిద్, ఏఎన్‌ఏంలు లలిత, సుజాత తదితరులున్నారు.