
సీజనల్ వ్యాధుల బారిన పడొద్దు
సాత్నాల: సీజనల్ వ్యాధుల బారిన పడొద్దని డీఎంహెచ్‌వో సాధన సూచించారు. భోరజ్ మండలం గిమ్మ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్‌పై విద్యార్థులు అవగాహన కలి గి ఉండాలని తెలిపారు. వ్యాధి లక్షణాలను వి ద్యార్థులకు వివరించి నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ సుచల, సూపర్‌వైజర్ చంద్రశేఖర్, అనిత, ఏఎన్‌ఎంలు అరుణ, రుక్మిణి, ఆశ, హెచ్‌ఎం పద్మజ తదితరులున్నారు.