
కంప్యూటర్ ఆపరేటర్ల నిరసన
కై లాస్‌నగర్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గురువారం విధులు బ హిష్కరించి డీపీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. తమ వేతనం రూ.22,750 ఉండగా.. రూ.19,500 మాత్రమే ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోందని ఆరోపించారు. ఇలా వేతనాలు తగ్గించి ఇవ్వ డంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంజేశారు. మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంత రం డీపీవో రమేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు.