
బంద్ ప్రశాంతం
● డిపోలకే పరిమితమైన బస్సులు ● స్తంభించిన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ● ఆదివాసీల నిరసనకు అన్నివర్గాలు మద్దతు
జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు
కైలాస్‌నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 రద్దు చేయాలనే డిమాండ్‌తో ఆదివాసీ గిరిజన సంఘాలు చేపట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ మండల కేంద్రాల్లో ఆది వాసీ సంఘాల నాయకులు ర్యాలీలు చేపటారు. అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణాలను పూర్తిగా మూసివేయించారు. మధ్యాహ్నం వరకు జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. ఆదివాసీల పోరాటాల ఫలితంగా వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో వారిలో హర్షం వ్యక్తమైంది.
బస్టాండ్‌లో ఆందోళన
ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులతో పాటు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఉదయం 4గంటలకే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. బస్టాండ్ ప్రధాన ద్వారం ఎదుట బై ఠాయించి బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం 2గంటలవరకు బస్సు లు డిపో దాటలేదు. బంద్ విషయం తెలియక బ స్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు బస్సుల్లేక ఇ బ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత బస్సులు యథా విధిగా నడిచాయి. పట్టణంలోని వాణిజ్య, వర్తక సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆందోళనకారులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరి జన హక్కులను హరించేలా చర్యలు తీసుకోవడం సరికాదని తమ వైఖరి మార్చుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.

బంద్ ప్రశాంతం

బంద్ ప్రశాంతం