
యూరియా కొరత లేకుండా చర్యలు
కైలాస్‌నగర్: జిల్లాలో రైతులకు అవసరమైన యూరి యాకు ఎలాంటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందుకు సంబంధించి సలహాలు, సూచనల కోసం 89777 41771 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ స్టాక్ వివవరాలను ప్రతి రోజు డిస్‌ప్లే చేయాలన్నారు. అలాగే టోల్‌ఫ్రీ నంబర్‌ను స్థానిక రైతువేదికలు, బస్టాండ్, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. వర్షాల ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే 18004251939 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డులను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వరకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా