● ప్రాజెక్టు కాలువల పర్యవేక్షణకు.. ● నీటిపారుదల శాఖలో ఔట్‌సోర్సింగ్‌ నియామకానికి అడుగు | - | Sakshi
Sakshi News home page

● ప్రాజెక్టు కాలువల పర్యవేక్షణకు.. ● నీటిపారుదల శాఖలో ఔట్‌సోర్సింగ్‌ నియామకానికి అడుగు

Jul 20 2025 5:58 AM | Updated on Jul 20 2025 3:05 PM

● ప్రాజెక్టు కాలువల పర్యవేక్షణకు.. ● నీటిపారుదల శాఖలో ఔ

● ప్రాజెక్టు కాలువల పర్యవేక్షణకు.. ● నీటిపారుదల శాఖలో ఔ

సాక్షి, ఆదిలాబాద్‌: లస్కర్‌ (మ్యాన్‌ మజ్దూర్‌) ఈ ప దం రెండు దశాబ్దాల క్రితం నీటి ప్రాజెక్టుల వద్ద సా ధారణంగా వినిపించేది. ప్రతీ రైతుకు తమ పరిధి లోని కాలువకు సంబంధించి లస్కర్‌ పేరు వారి నోట్లో నానేది. అప్పుడు ఇవీ రెగ్యులర్‌ పోస్టులు. అంతే కాకుండా నిరంతరంగా కాలువల వద్ద బాధ్యతగా విధులు నిర్వహిస్తు అన్నదాతకు చేదోడువా దోడుగా నిలిచేవారు. అలాంటిది రెగ్యులర్‌ పోస్టుల్లో ఉన్న లస్కర్లు రిటైర్డ్‌ అవ్వడం, ప్రభుత్వం కొత్త వారిని నియమించకపోవడంతో రానురాను ఈ పదం దాదాపుగా కనుమరుగైంది. ఈతరం వారి కి అసలు అలాంటి పోస్టు ఉంటుందనేదే తెలి యదు. ప్రస్తుతం రెగ్యులర్‌గా వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉండటం గమనార్హం. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు వచ్చాయంటే.. ప్రభుత్వం మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన లస్కర్‌ పోస్టు నియామకానికి రంగం సిద్ధం చేసింది. ఇక ప్రాజెక్టుల కింద కాలువలపై వీరి సందడి కనిపించనుంది. రైతులకు సాగు నీరందించే ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కాలువల పర్యవేక్షణ కోసం గతంలో ఇరిగేషన్‌ శాఖ లో కింది స్థాయిలో లస్కర్లు ఉండేవారు. ప్రాజెక్టులు నిండిన, నిండకపోయినా.. సాగునీరు విడుదలైన, కాకపోయినా.. ఈ లస్కర్లు కాలువలపైనే విధులు నిర్వర్తించేవారు. ఒక్కో ప్రాజెక్ట్‌ పరిధిలో పదుల సంఖ్యలో పోస్టులు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ పదమే మర్చిపోవాల్సిన పరిస్థితి. ఆ శాఖలో పనిచేసే సీనియర్‌ అధికారులకు తప్ప ఇటీవల విధుల్లో చేరిన కొత్త వారికి లస్కర్‌ అంటే అర్థం తెలియని పరిస్థితి. గతంలో పనిచేసిన వారు వయస్సుపైబడి కొందరు పదవీ విరమణ పొందగా, మరికొందరు ప్రాణాలను కోల్పోయారు. జిల్లాలోని సాత్నాల మధ్య తరహా ప్రాజెక్టులో ప్రస్తుతం ఒకే ఒక్క రెగ్యులర్‌ లస్కర్‌ నగేశ్‌ పనిచేస్తుండడం గమనార్హం. ఆయన రిటైర్మెంట్‌ కూడా త్వరలోనే ఉంది.

కాలువలపై పర్యవేక్షణ లేక..

లస్కర్‌పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఏళ్లుగా ప్రా జెక్టుకాలువలపై నీటిపారుదలశాఖ పర్యవేక్షణ కను మరుగైందన్న ఆశ్చర్య పోనవసరం లేదు.కా లు వలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల కబ్జాకు కూడా గురవుతున్నాయి. శాఖా అధికారులు ఆఫీసులు వదిలి బయటకు రాకపోవడం, వచ్చిన నీటి విడుదల జరిగినప్పుడు మొక్కుబడి పర్యవేక్షణ తప్ప పూర్తిస్థాయిలో తిరిగే పరిస్థితి లేవు.

నియామకాలకు రంగం సిద్ధం..

రాష్ట్రప్రభుత్వం శనివారం జీవో ఆర్‌టీనంబర్‌ 1212 విడుదల చేసింది. నీటి పారుదలశాఖలో రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న వివిధ రకాల పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన నియమించేందుకు ఉత్తర్వులు జారీ చే సింది. అందులో లస్కర్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకునే వారిని ఏడాది పా టు కొనసాగించనున్నారు. తర్వాత ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా పొడిగింపు అవకాశముంది.

ఎస్‌ఈల పరిధిలో పోస్టుల సంఖ్య ఇలా..

ఆదిలాబాద్‌ చీఫ్‌ ఇంజినీర్‌ : 72

మంచిర్యాల చీఫ్‌ ఇంజినీర్‌ : 67

గతంలోనే ప్రతిపాదనలు పంపాం

లస్కర్ల నియామకానికి సంబంధించి గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. ప్రధానంగా కాలువల పర్యవేక్షణ లస్కర్ల బాధ్యత.

– మధూసుదన్‌ రెడ్డి,

ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement