
‘వీపీవో’ అమలు చేయాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌రూరల్: ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో గల వార్డులు, గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్ వి ధానం కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మావల పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. అలాగే సమయపాలన పాటించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులపై గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్‌లో నమోదైన కేసులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నా రు. డయల్ 100 సిబ్బంది సంఘటన స్థలాలకు వీ లైనంత త్వరగా చేరుకొని బాధితులకు భరోసా క ల్పించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, సీఐ కర్రె స్వామి, ఎస్సైలు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, యూనస్, ఏఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
ఏపీకే ఫైల్స్, తెలియని వెబ్‌సైట్లతో జాగ్రత్తగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్:ఇన్వెస్ట్‌మెంట్‌ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్‌సైట్స్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ వంటి నూత న పద్ధతులలో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ ఓ ప్రకటనలో సూచించారు. మోసపోయిన ట్లు గ్రహించిన వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని తెలిపారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. సోషల్ మీడియాలోవచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే మొబైల్ కంట్రోల్‌సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వె ళుతుందని తెలిపారు. వారంవ్యవధిలో జిల్లావ్యా ప్తంగా 9 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.