
విద్యార్థులతోనే సమాజంలో మార్పు
● కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థులతోనే సమాజంలో మార్పు ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని అంకోలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఆరోగ్య పాఠశాల జాతర, గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ముందుగా వన మహోత్సవంలో భాగంగా మొక్క నాటారు. అనంరం ఆరో గ్య కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్ చాంపియన్ల కు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థి దశలోనే మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. అ నంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజ నం చేశారు. ఇందులో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి పద్మభూషణ్‌రాజు, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఎంపీడీవో స్వప్న శీల, మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సందర్శించారు. నెలవారీ తనిఖీలో భాగంగా ఈవీఎంల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. సిబ్బందితో మా ట్లాడి భద్రతాపరంగా పలు సూచనలు చేశారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పంచపూల ఉన్నారు.