● జిల్లాలో 3 జెడ్పీటీసీ.. 8 ఎంపీటీసీ స్థానాలు పెంపు ● గ్రామ పంచాయతీ, వార్డులు కూడా.. ● అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ● ఎన్నికల నిర్వహణపై మొదలైన చర్చ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 3 జెడ్పీటీసీ.. 8 ఎంపీటీసీ స్థానాలు పెంపు ● గ్రామ పంచాయతీ, వార్డులు కూడా.. ● అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ● ఎన్నికల నిర్వహణపై మొదలైన చర్చ

Jul 17 2025 3:58 AM | Updated on Jul 17 2025 3:58 AM

● జిల

● జిల్లాలో 3 జెడ్పీటీసీ.. 8 ఎంపీటీసీ స్థానాలు పెంపు ● గ

కై లాస్‌నగర్‌: స్థానిక సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల స్థానాలను బుధవారం అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో 20 జెడ్పీటీసీలు, 20 ఎంపీపీలు ఉండగా, 166 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కొత్తగా మూడు జెడ్పీటీసీలు, మూడు ఎంపీపీతో పాటు 8 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలు పెరిగాయి. నూతనంగా మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన అనివార్యమైంది. తదనుగుణంగా కసరత్తు చేసిన అధికారులు మండలాల వారీగా ఖరారు చేస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. పూర్వ మండలాల నుంచి కొత్తగా ఏర్పడిన మండలాలకు జనాభా సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను కేటా యించిన అధికారులు మరో రెండు మండలాల్లో వాటి సంఖ్య పెంచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 158 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పెరిగిన స్థానాలతో ఈ సంఖ్య ప్రస్తుతం 166కు చేరింది. జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడటంతో వీటి సంఖ్య 473కు చేరింది. అలాగే 3,870 వార్డులు న్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ సభ్యులున్న మండలాల్లో సర్వసభ్య సమావేశాల నిర్వహణకు వీలుగా కనీసం ఐదుగురు సభ్యులండేలా పునర్విభజన చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఎన్నికలకు ఎప్పుడైన నోటిఫికేషన్‌ రావచ్చనే చర్చ ఊపందుకుంది. ఆ దిశగా ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

ఎంపీటీసీ స్థానాల పెంపు ఇలా...

2019లో జరిగిన ఎన్నికల్లో జైనథ్‌ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండేవి. ఆ మండలాన్ని విభజించి కొత్తగా భోరజ్‌, సాత్నాల మండలాలను ఏర్పా టు చేశారు. నూతన మండలాల్లోని గ్రామ పంచాయతీల సంఖ్యకనుగుణంగా ఎంపీటీసీ స్థానాల ను ప్రకటించారు.

● ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం ఈ మండలంలోని పలు గ్రామాలు కొత్తగా ఏర్పడిన సాత్నాల మండలంలో చేరాయి. దీంతో ఈ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది.

● బోథ్‌ మండలంలో గతంలో 14 ఎంపీటీసీ స్థానా లుండగా ఈ మండలం నుంచి కొత్తగా సొనాల మండలాన్ని ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లోని గ్రామ పంచాయతీల సంఖ్యకనుగుణంగా ఎంపీటీసీలను కేటాయించారు.

● మావల మండలంలో గతంలో మూడు గ్రామా ల పరిధిలో ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే ఉండేవారు. ఇందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్‌ ఎంపీపీగా ఎన్నికై తే ఒక సభ్యుడు మాత్రమే ఉండేవారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో జనాభా కు అనుగుణంగా ఈ మండలంలో అదనంగా మరో రెండు స్థానాలను పెంచారు.

● ఇక 2019లో మున్సిపల్‌ ఆవిర్భావం పేరిట ఎన్నికలకు దూరంగా ఉన్న ఉట్నూర్‌ గ్రామ పంచాయతీలో గతంలో 14 ఎంపీటీసీ సీట్లు ఉండగా పెరిగిన జనాభాకు అనుగుణంగా అదనంగా మరో 4 స్థానాలు పెంచారు.

● బేల మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానా లుండగా ఈ మండలంలోని పలు గ్రామాలను సాత్నాల మండలంలో కలుపడంతో రెండు స్థా నాలను తగ్గించారు.

● సిరికొండ మండలంలోని మల్లాపూర్‌ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలంలో కలుపడంతో సిరికొండలో ఓ ఎంపీటీసీ స్థానం తగ్గించగా, ఇంద్రవెల్లిలో ఓ ఎంపీటీసీ స్థానం పెరిగింది.

● ఈ మండలాలు మినహా మిగతా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆయా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాలు యథాతథంగా ఉన్నట్లుగా జెడ్పీ సీఈవో జి.జితేందర్‌ రెడ్డి తెలిపారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయం

పునర్విభజన మండలాల్లో గ్రామపంచాయతీలు,

ఎంపీటీసీ స్థానాల వివరాలు..

మండలం గ్రామ ఎంపీటీసీ జనాభా

పంచాయతీలు స్థానాలు

సొనాల 12 05 13,025

భోరజ్‌ 17 05 17,909

సాత్నాల 17 05 13,662

ఆదిలాబాద్‌

రూరల్‌ 31 10 34,514

బేల 31 09 32,661

బోథ్‌ 21 10 35,191

జైనథ్‌ 17 07 23,788

మావల 03 05 6,310

ఉట్నూర్‌ 38 18 63,465

● జిల్లాలో 3 జెడ్పీటీసీ.. 8 ఎంపీటీసీ స్థానాలు పెంపు ● గ1
1/1

● జిల్లాలో 3 జెడ్పీటీసీ.. 8 ఎంపీటీసీ స్థానాలు పెంపు ● గ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement