
మొక్కలు నాటి సంరక్షించాలి
● కలెక్టర్ రాజర్షి షా
బోథ్: వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల ని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించారు. తొలుత సో షల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల ఆవరణ లో మొక్క నాటారు. కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భా గంగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించా రు. అనంతరం బోథ్ సీహెచ్‌సీని సందర్శించారు. త్వరలోనే బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తామని తెలి పారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. అనంతరం పొచ్చెరలో మొక్కలు నాటారు. గ్రామస్తులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమాల్లో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఈవో శ్రీనివాస్ ఆరోగ్య పాఠశాల కోఆర్డినేటర్ అజయ్, ఎంపీడీవో రమేశ్, ప్రిన్సిపాల్ సంగీత, తదితరున్నారు.