
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా అనిల్‌యాదవ్
కై లాస్‌నగర్: క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ అధిష్టా నం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీ గా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీపీసీసీ.. తాజా గా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీలను నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ కు రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదముద్ర వేశారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే రంగంలోకి దిగి గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామక ప్రక్రియ పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించడంపై శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు అనిల్ కుమార్ ఈ వారంలోనే జిల్లా పర్యటనకు రానున్నట్లుగా సమాచారం.