
గోడు విని.. భరోసా కల్పించి
వేదిక : టీఎన్జీవో సంఘ భవనం, ఆదిలాబాద్ సమయం: ఉదయం11:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
కైలాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. మొహర్రం పండుగ, జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన వారి సమస్యలను ఓపిగ్గా ఆలకించారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలపై మొత్తం 91 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీకలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో వినోద్‌కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.
ప్రజావాణికి 91 దరఖాస్తులు
అర్జీలు స్వీకరించిన కలెక్టర్
ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి..
గత ప్రభుత్వ హయంలో మా గ్రామానికి 97 డబుల్‌బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశారు. మా సొంత స్థలాల్లో నిర్మించి ఇస్తామంటే మేమున్న ఇండ్లను కూల్చివేశాం. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ స్లాబ్ వరకు పూర్తి చేశారు. ప్లాస్టరింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్లుగా పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– మసాల గ్రామస్తులు, బేల

గోడు విని.. భరోసా కల్పించి