
నాణ్యమైన బోధన అందించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో జిల్లాలోని ఎంఈవోలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీలకు సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రొగ్రేషన్ యాక్టివిటి, ఎఫ్‌ఆర్‌ఎస్, ఉపాధ్యాయుల వివరాలు, బడిబాట వివరాలు, యూనిఫాం తదితర మౌలిక అంశాలపై సమీక్షించారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి, సుజాత్ ఖాన్, ఉస్మాన్ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
సాత్నాల: విద్యార్థి దశనుంచే ఆరోగ్య అలవాట్ల పై దృష్టిసారించాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అ న్నారు. భోరజ్‌మండలంలోని పిప్పర్‌వాడ జెడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం తనిఖీ చేశా రు. విద్యార్థులు తయారు చేసిన హెల్త్ కార్నర్‌ను చూసి అభినందించారు. అనంతరం యాంటీ డ్రగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో నోడల్ ఆఫీసర్ హజార్, సీసీ రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయురాలు శశికళ తదితరులున్నారు.
● ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆదిలాబాద్ పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఆ దంపతులకు ఉన్న ఇద్దరు పిల్లలు మరణించడంతో వారికి కడుపుకోత మిగిలింది. మూలమలుపు వద్ద కారు అదుపు తప్పడంతో బోల్తా పడింది. సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

నాణ్యమైన బోధన అందించాలి