
● ఔట్‌సోర్సింగ్ టెండర్లు తెరిచి 50 రోజులు పైబడే.. ● పర
సాక్షి,ఆదిలాబాద్: ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు కోసం మే నెలలో దరఖాస్తులు స్వీకరించారు.. అదే నెల రెండో వారంలోనే అధికారుల సమక్షంలో టెండర్లు తెరిచారు.. ఏజెన్సీలకు సంబంధించిన అన్ని అంశాలను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తామని ఆ రోజు అధికారుల కమిటీ ప్రకటించింది.. త్వరలోనే కొత్త ఏజెన్సీల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు.. టెండర్లు తెరిచి ఇప్పటికే 50 రోజులు దాటింది.. దరఖాస్తు చేసుకున్న వారు జాబితాలో తమ ఏజెన్సీ పేరు ఉంటుందా.. లేదా అని ఎదురుచూస్తూనే ఉ న్నారు.. పరిశీలన ఎక్కడివరకు వచ్చింది.. జాప్యం ఎందుకు అవుతుంది.. అనే విషయాలను అధికారులెవరు బయటకు చెప్పరు.. అంతా మా ఇష్టం అనే రీతిలో వ్యవహారం సాగిస్తున్నారు.. అసలు ప్రక్రియకు మొదట్లోనే గడువు అంటూ విధించాలి.. ఈ ప్రక్రియను మరిచారా.. లేని పక్షంలో తెరవెనకాల ఏదైనా జరుగుతుందా.. అనే అనుమానాలు ఏజెన్సీ నిర్వాహకుల్లో వ్యక్తమవుతున్నాయి.
రూ.5లక్షల డీడీ చెల్లించి మరీ..
జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటుకు రూ పొందించిన నిబంధనల విషయంలో మొదట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎక్కడా లేని విధంగా రూ.5లక్షల డీడీ చెల్లించి మరీ ఈ టెండర్‌లో పాల్గొనాలని నిబంధన విధించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ కమిటీ ఈ విషయాలను పట్టించుకోలేదు. దీంతో పలువురు ఏజెన్సీ నిర్వాహకులు దరఖాస్తు గడువు చివరి తేదీ వరకు వేచిచూసి ఇక నిబంధనలు మార్చే పరిస్థితి లేదని గ్రహించి ఎలాగోలా రూ.5లక్షలు సర్దుబాటు చేసి మరీ డీడీ రూపంలో కట్టి టెండర్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా ఎంప్యానల్‌మెంట్‌లో తమ ఏజెన్సీని గుర్తిస్తారని వారు ఎన్నో ఆశలతో ఉన్నా రు. అయితే 50 రోజులు పైబడినా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పలువురు ఏజెన్సీ నిర్వాహకులు ఉపాధికల్పన శాఖ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతూ టెండర్ల విషయమై వాకబు చేస్తూ వస్తున్నారు. అయితే వారికి అక్కడ సరైన సమాధానం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
తెరవెనక ఏదో జరుగుతుందన్న ప్రచారం..
కొత్త ఎంప్యానల్‌మెంట్ గుర్తింపునకు సంబంధించి జాప్యం చేయడం వెనక ఏదో జరుగుతుందన్న ప్ర చారం సాగుతుంది. కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో ఈ విషయంలో అడిగితే.. ప్రస్తుత ఏజెన్సీ నిర్వాహకులు మళ్లీ తమనే కొనసాగించాలనే విషయంలో కోర్టుకు వెళ్లారని, దాంతోనే ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని అధికారి పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అధికారులే కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులను వెనుకేసుకొస్తూ వారిని కోర్టును ఆశ్రయించాలని పురమాయించినట్లుగా ప్రచారం సాగుతుంది. అక్కడి నుంచి ఏదైన స్టే వస్తే టెండర్లు ఆపేయవచ్చని ప్రయత్నాలు సాగుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అధికారులే ఈ జాప్యానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల్లో జాబితా..
ఎంప్యానల్‌మెంట్‌లో గుర్తింపు పొందిన ఏజెన్సీల జాబితాను బుధవారం వరకు ప్రకటిస్తాం. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తాం. తదుపరి తుది జాబితా ప్రకటిస్తాం. కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ టెండర్లు జరుపుకోవచ్చని అక్కడి నుంచి పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో టెండర్లను రెండు రోజుల్లోనే పూర్తి చేస్తాం.
– మిల్కా,ఉపాధికల్పన జిల్లా ఇన్‌చార్జి అధికారి

● ఔట్‌సోర్సింగ్ టెండర్లు తెరిచి 50 రోజులు పైబడే.. ● పర

● ఔట్‌సోర్సింగ్ టెండర్లు తెరిచి 50 రోజులు పైబడే.. ● పర