
విధులు విస్మరిస్తే చర్యలు
● హెచ్‌వోడీలు, వైద్యులతో రిమ్స్ డైరెక్టర్ సమావేశం ● డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోల నియామకం
ఎఫెక్ట్..
ఆదిలాబాద్‌టౌన్: విధులు విస్మరించే వైద్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్ వైద్యమే’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన డైరెక్టర్ తన చాంబర్‌లో ఆయా హెచ్‌వోడీలు, సీనియర్ వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. రిమ్స్‌కు వచ్చేది పేదలేనని, వారికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి నాణ్య మై న వైద్య సేవలందించాలని ఆదేశించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నరేందర్ భండారి, డాక్టర్ దీపక్ పుష్కర్‌లను డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు గా నియమించారు. అలాగే నలుగురికి ఆర్‌ఎంవో లుగా విధులు కేటాయించారు. జనరల్ ఆస్పత్రిలో ఉదయం సి.సాయిప్రసూన్‌రెడ్డి, మధ్యాహ్నం వసంత్‌రావు, రాత్రి కృష్ణప్రసాద్, అలాగే సూపర్‌స్పెషా లిటీ ఆర్‌ఎంవోగా చంపత్‌రావులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విధులు విస్మరిస్తే చర్యలు