
గ్రామాల్లో మొహర్రం సందడి
గ్రామాల్లో మొహర్రం సందడి మొదలైంది. కులమతాలకతీతంగా పీరీలకు పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
రేబిస్‌తో జాగ్రత్త
పశుపోషకులు, జంతు, పక్షి ప్రేమికులు జూ నోసిస్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు.
9లోu
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
రణదీవేనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగాభ్యసనలో విద్యార్థులు
11న మెగా జాబ్‌మేళా
కై లాస్‌నగర్: ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న జిల్లా విద్యార్థుల ప్రయోజనార్థం ఈనెల 11న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజ ర్షి షా ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 9గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హెచ్‌సీఎల్ సంస్థ నిర్వహిస్తున్న టెక్ బీ కార్యక్రమంలో భాగంగా 2024–25లో ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ, వొకేషనల్ కంప్యూటర్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులని పే ర్కొన్నారు. ఓవరాల్‌గా 75శాతం, మ్యాథమెటిక్స్‌లో 60శాతం మార్కులు పొందిన విద్యార్థులు సర్టిఫికెట్లతో సంబంధిత హాజరుకావాలని సూచించారు. వివరాలకు హెచ్‌సీఎల్ ప్రతినిధిని 8074065803, 7981834205 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
నార్నూర్ పాఠశాలలో ఆటలో నిమగ్నమైన చిన్నారులు
న్యూస్‌రీల్
ఆటపాటలతో ఆకట్టుకుంటున్న.. నార్నూర్
నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఇందులో గతేడాది 61 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది నిర్వహించిన బడిబాటలో కొత్తగా 40 మంది చేరారు. ఆటపాటలతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తుండడంతో ఆదరణ పెరగుతోందని ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ తెలిపారు.

గ్రామాల్లో మొహర్రం సందడి