
అమర్‌నాథ్ యాత్రలో జిల్లావాసులు
ఆదిలాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ శైవక్షేత్రమైన అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు జిల్లాకు చెందిన భక్తులు తరలివెళ్లారు. శ్రీనగర్ సమీపంలోని పహల్గాం నుంచి ప్రారంభమైన పాదయాత్ర శేష్‌నాగ్ వరకు 16 కిలోమీటర్లు, అక్కడి నుంచి అమర్‌నాథ్ వరకు 20 కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం 800 మెట్లను ఎక్కిన తర్వాత శివలింగం దర్శనం అయినట్లు భక్తులు తెలిపారు. ఇందులో జిల్లాకు చెందిన భక్తులు డాక్టర్ కాలే సతీష్, రామగిరి అశ్విన్, అర్జున్, రాకేశ్‌రెడ్డి, జైపాల్ తదితరులు ఉన్నారు.