
పనిచేసే వారికే పదవులు
కై లాస్‌నగర్: కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వారికే తగిన గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు, పార్టీ సంస్థాగత ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ఎం.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పట్టణ శివా రులోని రత్నాగార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రేణులనుద్దేశించి మా ట్లాడారు. గతంలో జిల్లా అధ్యక్ష పదవీ గాంధీభవన్ నుంచి పేరును ఢిల్లీకి సిఫారసు చేసిన వ్యక్తికే వచ్చేదన్నారు. ప్రస్తుతం పార్టీశ్రేణల అభిప్రాయం మేరకే అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. సామాజిక వర్గాల సమతుల్యత ఆధారంగా అన్ని వర్గాలతో కూడిన జిల్లా కాంగ్రెస్ కమిటీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శా తం రిజర్వేషన్లను కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి నే తృత్వంలోని కేబినెట్ తీర్మానం చేసిందని గుర్తుచేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో కష్టపడి పని చేస్తే అందరికీ పదవులు దక్కనున్నాయన్నారు. పునర్విభజనతో రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 153కు పెరుగనుందన్నారు. దీంతో మహిళలకు పెద్దఎత్తున అవకాశాలు రానున్నాయని తెలిపారు. మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి ఆశీర్వాదంతో తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందినట్లుగా గుర్తుచేశారు. పార్టీ పదవులు రానివారికి నామినేటెడ్ పోస్టులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తగు ప్రాధాన్యత క ల్పించేలా కమిటీని నియమిస్తామన్నారు. అంతకు ముందు కేబినెట్‌తీర్మానాన్ని హర్షిస్తూ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కాగా అంతకు ముందు జిల్లాకు చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇందులో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు, ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యామ్‌నాయక్, ఇంద్రకరణ్ రెడ్డి,గోక గణేశ్‌రెడ్డి, ఆత్రం సుగుణ, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, చరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక వర్గాల సమతుల్యతతో జిల్లా కమిటీ
కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ
కై లాస్‌నగర్: దేశంలోని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వ యత్నాలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పా ర్టీ ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్‌చార్జి, అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పనిచేసే వారికే పదవులు