
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ సిబ్బంది యూనిఫాం గౌరవం పెంచేలా మరింత బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన పోలీస్ పరేడ్‌ను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ శనివారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ కార్యాలయాల్లో పరేడ్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్‌కుమార్, ప్రేమ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, చంద్రశేఖర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.
హోంగార్డు కుమార్తె చదువుకు ఆర్థిక సాయం
ముంబాయి ఐఐటీలో జియో ఫిజిక్స్ కోర్సులో సీటు పొందిన హోంగార్డు పునరామ్ కుమార్తె వైష్ణవిని ఎస్పీ శనివారం ప్రత్యకంగా అభినందించారు. ఆమెకు ఉన్నత చదువు నిమిత్తం రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు.ఇందులో సూపరింటెండెంట్ సులోచన, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వామన్ తదితరులు పాల్గొన్నారు.