
ఆకర్షిస్తున్న సర్కారు బడులు
ప్రైవేట్‌కు ధీటుగా..యాపల్‌గూడ
ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని యాపల్‌గూడ ప్రాథమిక పాఠశాలకు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది ప్రైవేట్‌కు ఽధీటుగా కొనసాగుతుంది. ఇందులో 320 మంది విద్యార్థులున్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగుతుంది. ఆవరణలోకి అడుగుపెట్టగానే పూల మొక్కలు స్వాగతం పలికేలా కనిపిస్తాయి. పిల్లల కోసం ఊయాలలు, కిచెన్‌గార్డెన్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల మాదిరిగా టై, బెల్టు, షూ ధరించి బడికి హజరవుతారు. ఇక్కడ కంప్యూటర్,ఏఐ ద్వారా విద్యాబోధన ప్రత్యేకం. పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది దాదాపు వంద అడ్మిషన్లు అయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ప్రైవేట్‌కు వెళ్లేవారు సైతం చేరుతున్నారని ప్రధానోపాధ్యాయుడు గంగన్న పేర్కొన్నారు.