
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
ఆదర్శం.. రణదీవేనగర్
ఆదిలాబాద్‌లోని రణదీవేనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో 343 మంది విద్యార్థులున్నారు. 20 కంప్యూటర్లతో విద్యాబోధన సాగుతుంది. ఇక్కడ ఏఐ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. మూడు డిజిటల్ ప్యానెల్ బోర్డులు ఉన్నాయి. ప్రత్యేక గ్రంథాలయం, ప్రావీణ్య ఏజెన్సీ ద్వారా ఎక్స్‌ట్రా కరిక్యులం, శిరోస్ నిర్వహణ, న్యూ ట్రిషియన్ గార్డెన్, మన బడి, మన తోట ద్వారా పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజనానికి విని యోగిస్తున్నారు. ఈ ఏడాది 114 అడ్మిషన్లు అయినట్లు ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.