
ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు
తాంసి: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని డీఈవో శ్రీని వాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు ప్రభు త్వ పాఠశాలను తనిఖీ చేశారు. తాంసి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించా రు. అనంతరం తరగతి గదులకు వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. అ లాగేమండలంలోని గిరిగాం, గోట్కూరి ఉర్దూ, తాంసి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీకాంత్, కప్పర్ల హెచ్‌ఎం ఆనంద్, ఉపాధ్యాయులు, ఉన్నారు.
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
భీంపూర్: విద్యార్థుల హాజరు శాతం పెంచాల ని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని పిప్పల్‌కోటి జెడ్పీ ఉన్నతపాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి హెచ్‌ఎంలు నగేశ్, మహేశ్వర్, సీఆర్పీ రవీందర్ ఉన్నారు.