● సీ్త్రనిధి రుణం.. అక్రమాలమయం ● సభ్యుల ఖాతాల్లో జమకాని
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీ్త్రనిధి రుణాలు అందజేస్తోంది. చిరు వ్యాపారాలతో స్వ యం ఉపాధి సాధించాలనే ఉద్దేశంతో రుణాలను మంజూరు చేస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకొ ని రాణించాల్సిన మహిళలకు క్షేత్రస్థాయిలోని సి బ్బంది ద్వారా అవరోధం కలుగుతుంది. సభ్యులు చెల్లించిన నెలవారీ కిస్తీల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిన వీవోవోలు పక్కదారి ప ట్టిస్తున్నారు. తమ సొంత ఖాతాలకు మళ్లించుకొని సంఘ సభ్యులకు బురిడీ కొట్టిస్తున్నారు. ఆలస్యంగా ఈవ్యవహారం వెలుగు చూస్తుండంతో చేసేదేమి లేక నష్టపోవాల్సిన పరిస్థితి. జిల్లాలో ఇలా రూ. కోట్లలో అక్రమాలు చోటుచేసుకోవడం ఉన్నతాధికా రుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
ఏటా ఇదే తంతు..
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో అర్హత సాధించిన సంఘాలకు ప్రభుత్వం సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తుంది. రూ.30వేల నుంచి రూ.2లక్షల వరకు అందజేస్తూ వారు స్వయం ఉపాధితో రాణించేలా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో ఏటా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల రుణాలను సభ్యులకు అందజేస్తుంది. అయితే కొన్ని సంఘాలు వాటి ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధిస్తుండగా, మరికొన్ని సంఘాల్లో మాత్రం అక్రమాలు చో టు చేసుకుంటున్నాయి. రుణాలు పొందిన సభ్యులు ప్రతి నెలా కిస్తీలు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ వాటిని బ్యాంకుల్లో జమ చేయాల్సిన వీవోఏలు పక్కదారి పట్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిధులను తమ సొంత ఖాతా ల్లోకి మళ్లించుకుంటున్నారు. కొందరు అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. మరికొంత మంది ఇతర వ్యా పారాలు చేస్తున్నారు. దీంతో మహిళా సంఘాలు ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.
బాధ్యులపై చర్యలేవి..?
గ్రామంలోని స్వయం సహాయక సంఘాలకు మంజూరైన నిధులు, చెల్లించాల్సిన కిస్తులు, రికవరీని పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత సీసీలపై ఉంటుంది. అయితే వీవోఏలు దుర్వినియోగం చేసి న నిధులు ఇప్పటివరకు సంబంధిత మహిళా సంఘాల ఖాతాల్లో జమ కావడం లేదు. ఇందుకు బా ధ్యులైన సీసీలపై చర్యలు తీసుకోవాల్సిన డీఆర్డీఏ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం అనుమానా లకు తావిస్తోంది. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాల్సిందిపోయి ‘మామూలు’గా వ్యవహరించడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు
సీ్త్రనిధి రుణాల మంజూరు, రికవరీ, లక్ష్యసాధనను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రీజినల్ మేనేజర్‌ను నియమించింది. వాటిపై నిరంతరం పర్యవేక్షిస్తూ సంఘాలకు అండగా నిలవాల్సిన సదరు అధికారి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. అదనపు ఆర్‌ఎం ఉన్నప్పటికీ సదరు అధికారిదీ అదే పరిస్థితి. సంఘాలపై పర్యవేక్షణ కొరవడడంతో ఇలా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు న్నాయి. ఈ క్రమంలోనే వీవోఏలు, సీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సద రు అధికారి తీరుపై సంఘాల సభ్యులే కాదు సాక్షాత్తు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు ఆ శాఖ ఉద్యోగులే బాహటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పేరిట విధులకు గైర్హాజరయ్యే సదరు అధికారి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అసలు కనిపించరని ఆ శాఖ అధికారే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ విషయమై సీ్త్రనిధి జిల్లా మేనేజర్‌ను పలుమార్లు ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా ఫోన్ కట్ చేయడం గమనార్హం. డీఆర్డీవోను సంప్రదించగా అదనపు డీ ఆర్డీవోను సంప్రదించాలని పేర్కొనడం వారి మధ్య విబేధాలకు అద్దం పడుతుంది.
రికవరీపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో సీ్త్ర నిధి రుణ చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై దృష్టి సారించాం. సోషల్ ఆడిట్ సీఆర్‌పీల నుంచి మండలాల వారీగా ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటున్నాం. వాటి ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి సంఘాల సభ్యులతో విచారణ చేస్తున్నాం. అక్రమాలకు బాధ్యులైన వారు స్వాహా చేసిన మొత్తాన్ని చెల్లించాలని సూచిస్తున్నాం. నిర్ణీత గడువు విధిస్తున్నాం. సకాలంలో చెల్లించకుంటే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తాం. ఎవరినీ ఉపేక్షించబోం.
– జాదవ్ గోవింద్‌రావు, అదనపు డీఆర్‌డీఓ


