
మౌలిక వసతులు కల్పిస్తాం
● కలెక్టర్ రాజర్షి షా
కైలాస్‌నగర్: ప్రత్యామ్నాయ స్థలంలో ఎలాంటి ఇ బ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. చిరువ్యాపారుల కోసం కేటాయించిన గణేశ్ థియేటర్ స్థలాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. పలు వురు వీధి వ్యాపారులతో మాట్లాడి సౌ కర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఇప్పటి వరకు విద్యుత్, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్. రాజు, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి తదితరులున్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మహిళలు ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చే సుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన టైలరింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృత్తిపరమైన సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకుని స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇందులో డీ ఆర్డీవో రాథోడ్ రవీందర్, ఆయా సంస్థల ప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తే ఉపేక్షించం..
ఆదిలాబాద్‌అర్బన్: విత్తన వ్యాపారులెవరైనా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని అఖిల్ ఫర్టిలైజర్స్, రైతుమిత్ర ట్రెడర్స్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ వానాకాలం కోసం సరిపడా పత్తి, సోయా తదితర విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర స్వామి తదితరులున్నారు.
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో 8 నుంచి 12 తరగతుల వి ద్యార్థులకు నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ పోస్టర్‌ను రణదీవెనగర్ జెడ్పీఎస్‌ఎస్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివా స్‌రెడ్డి, పాల్గొన్నారు.