
గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..
గ్రామానికి బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఏ పనికై నా మేము జిల్లా కేంద్రానికే రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు, ఆస్పత్రికి రావాల్సి వస్తే మా ఇబ్బందులు వర్ణనాతీతం. గిరి ప్రాంతాలపై వివక్ష చూపడం తగదు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి.
– పి.రాము, ఖారగూడ, సాత్నాల
ఎటువంటి విజ్ఞప్తులు లేవు..
ప్రస్తుతానికై తే ఎలాంటి విజ్ఞప్తులు లేవు. ప్రయాణికుల సంఖ్య, విజ్ఞప్తుల ఆధారంగా ఆ ప్రాంతంలో సర్వే చేసి బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నేను చార్జ్ తీసుకొని కొద్ది రోజులే అవుతుంది. పరిశీలించి బస్సులను నడపడానికి కృషి చేస్తాం.
– ప్రతిమారెడ్డి, ఆదిలాబాద్ డిపో మేనేజర్

గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..