టీజీహెచ్‌వో రాష్ట్ర అధ్యక్షునిగా సందీప్‌కుమార్
ఉట్నూర్‌రూరల్: తెలంగాణ రాష్ట్ర ఉద్యా న అధికారుల సంఘం (టీజీహెచ్‌వో) రాష్ట్ర అధ్యక్షునిగా ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన అధికారి సందీప్‌కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గెజిటెడ్ భవన్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శి సత్యనారాయణ, ఎన్నికల అధికారి శ్రీరాంరెడ్డి, సహాయ ఎన్నికల అధికారి శ్రీనిశ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో తనను ఉద్యాన అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సందీప్‌కుమార్ తెలిపారు. ఉద్యాన అధికారుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉద్యాన అధికారుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు.


