
మాడిఫైడ్ సైలెన్సర్లు వద్దు
ఆదిలాబాద్‌టౌన్: మాడిఫైడ్ సైలెన్సర్లు బిగిస్తే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు కూ డళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. 50 వాహనాల సైలెన్సర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కొందరు వాహనదారులు భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లను ఏర్పా టు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని తె లిపారు. అలాంటి వాహనాలను సీజ్ చేసి, పబ్లి క్ న్యూసెన్స్, ఎంవీ యాక్ట్, పట్టణ మిషన్స్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్, సిబ్బంది ఉన్నారు.