వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.
ఆర్‌ఎంపీలు స్థాయికి
మించి వైద్యం చేయొద్దు
బేల: ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయవద్దని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలోని పలు ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, స్థాయికి మించి వైద్యం చేయవద్దన్నారు. నిబంధనలు అతి క్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు రక్త పరీక్ష ల్యాబ్‌లను సీజ్ చేశారు. ఆయన వెంట నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం జిల్లా అధికారి వంశీకృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.