breaking news
Xinhua news agency
-
చైనా పత్రికలపై భారత్
న్యూఢిల్లీ: చైనా పాల్పడుతున్న భారత వ్యతిరేక ప్రచారంపై కేంద్రం కన్నెర్రజేసింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా పత్రికల ఎక్స్ ఖాతాలను నిషేధించింది. అవి రెండూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రాల వంటివి. భారత ప్రభుత్వం ధ్రువీకరించని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న చైనా మీడియాకు మన రాయబార కార్యాలయం గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. అయినా అదే ధోరణి కొనసాగడంతో తాజా చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మూడు భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పచ్చి అబద్ధాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని, జర్నలిజం విలువలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆగ్రహించింది. అయితే గ్లోబల్ టైమ్స్పై నిషేధాన్ని బుధవారం అర్ధరాత్రి ఎత్తేసింది. -
భారత డ్రోన్‌ను కూల్చేశాం: చైనా ఆర్మీ
బీజింగ్: చైనా గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన భారత్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చేశామంటూ ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది. 'భారత్ చర్య చైనా ప్రాదేశిక సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించేలా ఉంది. దీనిపై మేం తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం' అని చైనా ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కొంబాట్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఝాంగ్ షుయిలిని ఉటంకిస్తూ జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్ పట్ల తాము వృత్తిపరమైన దృక్పథంతో వ్యవహరించి.. దాని గుర్తింపు వివరాలు సేకరించామని ఆయన తెలిపారు. అయితే, ఈ డ్రోన్ ఎప్పుడు చైనాలోకి ప్రవేశించింది.. దీనిని ఎక్కడ కూల్చేశారు అనే విషయాలు వెల్లడించలేదు. చైనా, భూటాన్, సిక్కిం ట్రైజంక్షన్‌లో ఉన్న డోక్లాం కొండప్రాంతంలో సైనిక ప్రతిష్టంభన తలెత్తడంతో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కొండప్రాంతంలో సైనికులు ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొనడంతో దాదాపు రెండు నెలలు పరిస్థితి తీవ్ర వివాదాన్ని రేపింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్న నేపథ్యంలో చైనా చేస్తున్న తాజా వాదన గమనార్హం. -
మరింత తగ్గనున్న చైనా వృద్ధి స్పీడ్?
బీజింగ్: అమెరికా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి వేగం 2015తో పోల్చితే 2016లో మరింత తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండేళ్లలో పోల్చితే వృద్ధి 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గుతున్నట్లు జాతీయ అభివృద్ధి, సంస్కరణల వ్యవహారాల సహాయమంత్రి షవోషీ ఉటంకిస్తూ, ప్రభుత్వ జిన్హువా వార్తా సంస్థ ఒక వార్తను వెలువరించింది. అధికారిక గణాంకాలు వచ్చే కొద్ది రోజుల్లో వెలువడవచ్చని భావిస్తున్నారు. 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 2015లో జీడీపీ 6.9 శాతం పడిపోయింది. గత ఏడాది అమెరికా ఆర్థిక పరిమాణం మొత్తం 68.91 ట్రిలియన్ యన్లు (దాదాపు 9.96 ట్రిలియన్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 6.5%, 7% శ్రేణిలో ఉండాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మూడు త్రైమాసికాల్లో ఈ రేటు 6.7 %.