breaking news
Woman hangs self
-
ఉదయం 2 గంటలకు ఫోన్ చేసింది.. కానీ
చండీగఢ్ : ఇంటి యాజమాని వేధింపులతో విసుగు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గురాగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిస్తు సర్కార్. స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వర్తిస్తూ గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో పెయింగ్ గెస్ట్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్ తరచూ వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన యువతి మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌ను ఉరేసుకొని మరణించింది. బాధితురాలి తండ్రి హవాలు చందర్ సర్కార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును యాజమాని మానసికంగా వేధిస్తున్నాడని, తన చావుకు యాజమానే కారణామని.. అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా కూతురు మంగళవారం ఉదయం 2 గంటలకు కాల్ చేసింది. తన ఇంటి ఓనర్ అమరిందర్ సింగ్ తరచూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అదే రాత్రి తిరిగి ఇంటికి వచ్చినప్పడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడని చెప్పింది. నాతో ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. తన మొబైల్‌ను హ్యాక్ చేశాడని, ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదని నాతో చెప్పి ఫోన్ కట్ చేసింది. తర్వాత కొంత సమయానికి సింగ్ తనకు నా కూతురు ఏదో ఆఘాయిత్యానికి పాల్పడిందని సమాచారం ఇచ్చాడు. ఏం జరిగిందని అడిగితే సమాధానం చెప్పలేదు. నేను వెంటనే గురుగ్రామ్ పోలీసులను సంప్రదించి విచారణ జరిపించాలని కోరాను’ అని పేర్కొన్నాడు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతా జీవిగా పడి ఉంది. అయితే యువతి వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇంటి యాజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
కట్న దాహానికి గర్భిణి బలి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: కట్న దాహం ఓ గర్భిణిని బలితీసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని పోచారం అన్నానగర్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. పోలీసు లు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగు మండలం పందికొండ గ్రామానికి చెందిన పసుల వెంకన్న అదే జిల్లా నల్లవెళ్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన స్వప్న(21)ను గతేడాది ఏప్రిల్ 17న వివాహం చేసుకున్నాడు. ఐదు తులాల బంగారం, రూ. మూడున్నర లక్షలు, రూ.50 వేలు విలువ చేసే సామగ్రి, ప్యాషన్ బైకును స్వప్న తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చారు. ఆరునెలల క్రితం ఉపాధి కోసం దంపతులు మండలంలోని పోచారం అన్నానగర్ కాలనీకి వచ్చారు. వెంకన్న సమీపంలో ఉన్న ఐటీసీలో హమాలీ పనులు చేస్తున్నాడు. పుట్టింటి నుంచి రూ. రూ.50 వేలు అదనపు కట్నం తీసుకురావాలని వెంకన్న కొంతకాలంగా భార్యను వేధించసాగాడు. ఇదే విషయమై మం గళవారం భార్యాభర్తలు ఇంట్లో గొడవపడ్డారు. సాయంత్రం వెంకన్న పనికి వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన భార్యకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన వెంకన్న ఇంటికి వచ్చి చూడగా స్వప్న ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే కిందికి దించి కాలనీ వాసుల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు పరిశీలించి అప్పటికే స్వప్న మృతి చెం దినట్లు నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీ సుల సమాచారంతో బుధవారం ఉద యం స్వప్న తల్లిదండ్రులు, బంధువులు అన్నానగర్‌కు వచ్చారు. వెంకన్న అదనపు కట్నం కోసం వేధించడంతోనే స్వప్న ఆత్మహత్యకు పాల్పడింద ని కన్నీటిపర్యంతమయ్యారు. భర్త వేధింపులను తమకు ఎప్పటికప్పుడు స్వప్న ఫోన్ చేసి తెలిపేదని మృతురాలి తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు. బుధవారం మల్కాజిగిరి ఏసీపీ చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకొని బంధువులతో మాట్లాడారు. స్వప్న ఐదు నెలల గర్భవతి అని బంధువులు, కాలనీవాసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుం బీకులకు అప్పగించా రు. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.