breaking news
west godavari distrcit
-
అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
-
గోదారమ్మ చెంత అభిమాన పరవళ్లు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారమ్మ చెంత జన ప్రవాహం పరవళ్లు తొక్కింది.. అభిమాన కెరటం ఉవ్వెత్తున ఎగిసింది.. ఊరూ వాడా ఏకమై కదిలి వచ్చి జననేత ప్రజా సంకల్ప యాత్రకు మద్దతు పలికింది. భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయని జనం తమ అభిమాన నేతను చూసేందుకు పాదయాత్ర సాగిన మార్గంలో బారులు తీరారు. ప్రజా సంకల్ప యాత్ర 174వ రోజు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ఉండి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. విస్సాకోడేరు, గోరంగనముడి, పెన్నాడ, శృంగవృక్షం, నాదమూరు గరువు మీదుగా సాగింది. ప్రతి గ్రామంలోనూ జన ప్రవాహమే కనిపించింది. సమస్యలు చెప్పేవాళ్లు కొందరు.. అంతులేని అభిమానంతో వచ్చే వాళ్లు ఇంకొందరు.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగేవాళ్లు మరికొందరు.. వీరంతా జగనొస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, ఆ రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. గోదావరి సాక్షిగా జగన్ వెంట నడుస్తామంటున్నారు. ఉప్పొంగే జన హృదయాలతో మమేకమవుతూ, అవ్వతాతలకు ఆప్యాయత పంచుతూ, అక్క చెల్లెమ్మలను మనసారా పలకరిస్తూ.. యువజనాన్ని ఉత్సహభరితులను చేస్తూ జననేత ముందుకు సాగారు. మరపురాని ఘట్టాలు... మరచిపోని చిత్రాలు పాదయాత్రలో సామాజిక మాథ్యమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌ను కలిసేందుకు వచ్చే చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారు. వాటిని వెంటనే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. వాట్సాప్‌లో సన్నిహితులకు పంపుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొంతమంది కుటుంబ సభ్యులకు పాదయాత్రను లైవ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విస్సాకోడేరులో లీలావతి అనే గృహిణి ఇదే పని చేసింది. ‘ఇంట్లో మా అత్త, మామగారున్నారు. జగన్‌ను చూడాలన్నది వాళ్ల కోరిక. కానీ ఈ జనంలోకి రాలేకపోతున్నారు. హైదరాబాద్‌లో మా అమ్మ, నాన్న ఉన్నారు. విజయవాడలో మా వారు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లందరికీ మా ఊళ్లో జగన్ పాదయాత్రను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాను’ అని ఆమె ఫేస్‌బుక్‌ను చూపిస్తూ చెప్పింది. శృంగవృక్షం దగ్గర మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. జగన్ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఫేస్‌బుక్‌కు కనెక్ట్ అయ్యారు. పాదయాత్రను దగ్గరుండి లైవ్ ఇస్తున్న వారి అకౌంట్‌ను పరిశీలిస్తున్నారు. జగన్ ఎక్కడికొచ్చారు.. ఎంత దూరంలో ఉన్నారనే సమాచారాన్ని ఇళ్లలో ఉన్న వారికి చేరవేస్తున్నారు. ఆ ఊర్లోకి జగన్ అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వచ్చారు. అంతులేని అభిమానం... ‘దేవుడిని అడిగేశాను. జగన్‌ను సీఎం చేస్తానన్నాడు. ఇక తిరుగేలేదు’ అని లక్ష్మిదేవమ్మ అనే మహిళ కొండంత విశ్వాసంతో చెప్పింది. జగన్‌ను కలిసిన ఆ క్షణంలో ఆమె ఎన్నో చెప్పింది. మనసులో దాచుకున్న అభిమానం బయటకు తీసింది. వైఎస్ పాలన చూసిందట. ఎంతో ఆనందంగా ఉండేదట. మళ్లీ జగన్ వస్తేనే ఆ ఆనందం అంది. ‘అన్న నేనిచ్చిన కొబ్బరి నీళ్లు తాగాడు. ఇంతకన్నా నాకేం కావాలి’ అని గొరగనమూడిలో ఓ మహిళ సంబరపడింది. ‘అన్న నా చేతిలో చెయ్యేశాడు. నేనున్నానన్నాడు’ అని బదిర లక్ష్మి జగన్‌ను కలిసిన తర్వాత ఆనందం పంచుకుంది. ఊళ్లో బెల్ట్ షాపుందట. ఇబ్బందిగా ఉందని చెప్పిందట. దాన్ని తీయిస్తానని భరోసా ఇచ్చాడట. ఆ నమ్మకం చాలంది ఆమె. ‘జగనన్న వస్తున్నారని ఊళ్లోని మహిళలందరికీ కుంకుమ పెట్టి మరీ చెప్పాను.. ఇదో అందరూ వచ్చారు’ అని కుంకుమ భరిణి చూపిస్తూ శృతి సంతోషపడింది. బీటెక్ చదివాను. ఉద్యోగం లేదని చెప్పాను. ఇంకో ఏడాది ఓపిక పట్టమన్నాడు జగనన్న. మాకు నమ్మకముందంటూ పెన్నాడ దగ్గర జగన్‌ను కలిసిన విశేష్, సత్యప్రకాశ్, మల్లేశ్వర్ అన్నారు. ఈ ప్రభుత్వాన్ని భరించలేమన్నా.. దారిపొడవునా వివిధ వర్గాల వారు జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. టెట్ ఉత్తీర్ణులైనా అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ సౌజన్య ఆగ్రహంతో చెప్పింది. ‘అనాథనయ్యా.. కొడుక్కు దారి చూప’మంటూ చినరంగనిపాలెం వద్ద యల్లమ్మ వేడుకుంది. మా ఉద్యోగాలు పర్మినెంట్ కావా? అంటూ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు విస్సాకోడేరు వద్ద బావురుమన్నారు. మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదని పెన్నాడ వద్ద ప్రజలు చెప్పుకున్నారు. చంద్రబాబు సర్కారు బెల్ట్‌షాపులు పెట్టి ఎలా కష్టపెడుతుందో ఇదే గ్రామంలో మంకు వెంకట సత్యవతి, తులసీ మరికొందరు మహిళలు చెప్పారు. అందరి సమస్యలను జగన్ ఓపికగా విన్నారు. మన ప్రభుత్వం రాగానే అందరి సమస్యలు తీరుతాయని ధైర్యం చెప్పారు. ఆయనే మా లీడర్ ‘జగనే నిజమైన లీడర్ ’. ఫేస్బుక్ పేజీలో జనంతో జగన్ మమేకమైన పోస్టింగ్ లైక్స్ వైపు చూస్తూ శృంగవృక్షం వద్ద ఆనంద్ అనే వ్యక్తి అన్నమాటిది. డేటా ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న అతను జగన్ పాదయాత్ర కోసం సొంతూరొచ్చాడు. దాదాపు 50 మంది ఫ్రెండ్స్‌తో కలిసి ఫేస్బుక్ చూస్తున్న అతను ఎన్నో విషయాలు చెప్పాడు. ఒక పక్క పాదయాత్ర జరగుతోందని, మరో పక్క చంద్రబాబు మహానాడు నిర్వహిస్తున్నారని, ఈ రెండిండిపైనా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లు చూశానని చెప్పాడు. మహానాడు కన్నా.. జగన్ పాదయాత్రను చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని, లైక్‌లు, షేరింగ్‌లు రెట్టింపు ఉన్నాయని విశ్లేషించాడు. దీన్నిబట్టి జనం ఎవరిని కోరుకుంటున్నారో ఇట్టే తెలుస్తోందన్నారు. -
వాల్టా.. ఉల్టాకలప.. రయ్రయ్
పశ్చిమగోదావరి , తణుకు : జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడిచేలా ఇష్టారాజ్యంగా చెట్లు నరికి కలప రవాణా చేస్తున్నా అటవీశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు పర్మిట్లతో వాహనాల్లో తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు అంటున్నారు. మధ్యవర్తుల సాయంతో అటవీ శాఖలోని కొం దరు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగి పోతోంది. మరోవైపు జిల్లాలోని టింబర్ డిపోలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం వందలాది టన్నుల కలప వ్యాపారుల చేతుల్లోకి చేరుతోంది. దీంతో ఏటా రూ.కోట్ల మేర అక్రమ వ్యాపారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాం తాల నుంచి తరలిపోతున్న కలపను రాష్ట్ర సరిహద్దు మందలపల్లి అటవీ తనిఖీ కేంద్రం వద్ద మూడు వాహనాలను అక్కడి అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తణుకు ప్రాంతానికి చెందిన కొందరు టింబర్ డిపో నిర్వాహకులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున కలపను ఇక్కడకు తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అక్రమ వ్యాపారుల గుప్పెట్లోకి.. జిల్లాలో కలప రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు వ్యాపారుల గుప్పెట్లోకి చేరి పోవడంతో విచ్చలవిడిగా వ్యాపారం సా గుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఏలూరు, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని రిజర్వు ఫారెస్టుతోపాటు సాధారణ వనా లు ఉన్నాయి. జిల్లాలో 12 చదరపు కిలోమీటర్లు మేర దట్టమైన అడవులు ఉండగా మొత్తం 17 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలతోపాటు తీరప్రాంతాల నుంచి విచ్చలవిడిగా అక్రమంగా కలపను రవాణా చేస్తున్నా అరికట్టకపోవడంతో కలప వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. మరోవైపు జిల్లాలోని టింబర్ డిపోలపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 600 టింబర్ డిపోలు జిల్లాలో సుమారు 600 వరకు టింబర్ డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి కలపను దిగుమతి చేసుకుని పలురకాల వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అయితే అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు సిబ్బంది కొరతగా ఉన్నారనే సాకుతో తప్పించుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల రికార్డుల్లో లేని అనధికార టింబర్ డిపోలు చాలానే ఉన్నట్టు తెలిసింది. అనుమతులు ఎక్కడ..? కలప అమ్మకాలకు అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. జి ల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులను ప్రసన్నం చేసుకుంటే ఇష్టారాజ్యంగా కలపను అ క్రమ రవాణా చేయవచ్చనే భావనలో వ్యాపారులు ఉన్నారు. కలప రవాణా చేసే క్రమంలో దశలవారీగా అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాహనాలను ఇచ్చే పర్మిట్లలో కలప రవాణా అయ్యే మార్గంతోపాటు తేదీ, కలప చేరాల్సిన ప్రదేశం పొందుపరచాలి. దీం తోపాటు పర్మిట్‌పై సంబంధిత అధికారి సంతకం ఉండాలి. ఈక్రమంలోనే వ్యాపారులు నకిలీ పర్మిట్లు సృష్టించి తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బందికి మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాల్టా చట్టం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చర్యలు తప్పవు కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని టింబర్ డిపోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా అక్రమ కలప దిగుమతి చేసుకున్నట్టు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. –పి.ప్రకాశరావు, జిల్లా అటవీశాఖ అధికారి -
పశ్చిమగోదావరి జిల్లలో జంట హత్యల కలకలం
-
మహిళను గొడ్డలితో నరికి దారుణహత్య
ఏలూరు: మానవత్వం మంటగలుస్తోంది. సమాజంలో రోజురోజుకీ మనిషిన్నవాడూ మాయమైపోతున్నాడు. మనిషి మనిషిని చంపుకునే క్రూర సంస్కృతి దాపరించింది. భూముల కోసం, ఆస్తులు కోసం, పగలు ప్రతీకారల కోసం హత్యలు చేయడం సర్వ సాధారణం అయింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళను అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం గుటాలలో చోటుచేసుకుంది. భూవివాద విషయంలో మహిళపై ప్రత్యర్ధులు కక్ష కట్టి చంపినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.