breaking news
wearing helmet
-
ప్రభాస్ ఫోటోతో సిటీ పోలీస్ ట్వీట్..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ముందుండే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 2002లో ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ నేటి వరకు 19 సినిమాలు చేశాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. బాహుబలి వంటి భారీ చిత్రంలోని తన నటనతో కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అంతులేని అభిమానులను సంపాదించుకున్నాడు. నేడు డార్లింగ్ ప్రభాస్ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో అభిమానులు భారీగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పరిచి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అయితే పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే రాధే శ్యామ్ సినిమా నుంచి వివక్రమాదిత్యగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు మధ్యాహ్నం 12.02 గంటలకు బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ విడుదల చేయనున్నారు. ఈ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్ ఇక ప్రభాస్‌కు దేశం నలుమూలలా నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘హ్యపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్’ అంటూ ట్విటర్లో ట్రెండ్ క్రియెట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రబాస్ పెద్దనాన్న(కృష్ణం రాజు) కూతురు ప్రసీధ.. అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ‘నా అభిమాన హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఇలా ప్రేమగా ఉండి రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను అందుకోవాలి అన్నయ్య, మీ నుంచి ఎల్లప్పుడూ నేర్చుకోవటానికి చాలా సంతోషిస్తున్నాను. లవ్ యూ’. అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ప్రభాస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? Happy birthday, Prabhas! Wishing you infinite success, happiness and peace always😊 https://t.co/70j04zxG7G — Mahesh Babu (@urstrulyMahesh) October 23, 2020 ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు, వరుణ్ తేజ్,నటి రాశీ ఖన్నా, నిర్మాత బీఏ రాజు, బండ్ల గణేష్, గోపిచంద్ మలినేని, బాబీ, మెహర్ రమేష్, సరేందర్ రెడ్డి.. హ్యపీ బర్త్‌డే ప్రభాస్.. జీవితాంతం సంతోషంగా ఉండాలని, భవిష్యత్తుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీసులు సైతం సినిమా పోస్టర్లను ఉపయోగించి ట్రాఫిక్ నిబంధనలను, జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని బైక్‌పై హెల్మెట్ ధరించిన ఫోటోతో సందేశం ఇచ్చారు. ‘నీ మీద మీ జీవితమే కాదు.. మీ కుంటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయ్. హెల్మెట్ ధరించండి.’ అని ట్వీట్ చేశారు. చదవండి: వరదలు : ప్రభాస్ భారీ విరాళం నీ మీద మీ జీవితమే కాదు.. మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయ్ హెల్మెట్ ధరించండి..#wearhelmet #safetyfirst #HyderabadCityPolice pic.twitter.com/3LNDbo58N2 — Hyderabad City Police (@hydcitypolice) October 23, 2020 కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో మళ్లీ మొదలైంది. రాధే శ్యామ్ సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. Here’s wishing the darling of millions #Prabhas, a very happy birthday! Wish him all the luck and love! 😇 — Raashi (@RaashiKhanna) October 23, 2020 Here’s wishing the darling of millions #Prabhas, a very happy birthday! Wish him all the luck and love! 😇 — Raashi (@RaashiKhanna) October 23, 2020 -
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
-
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
సాక్షి, ఢిల్లీ: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఒకరు పాడిన పాట అందరి ప్రశంసలను అందుకుంటోంది. రహదారి భద్రత గురించి ఉన్న ఈ పాట వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమాలోని 'ఆప్నా టైమ్ ఆయేగా..' పాటను తన వెర్షన్లో పాడాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోండంటూ సలహాలను చరణాలుగా మలిచాడు. 42 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్డు భద్రతపై సందేశాన్నిచ్చే విధంగా సొంత లిరిక్స్నుపయోగించాడు సందీప్ సాహి అనే ట్రాఫిక్ పోలీస్. సందీప్ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. హెల్మెట్స్, సీట్‌బెల్ట్ ధరించండని ప్రస్తుత పాటలో వాహనదారులకు పిలుపునిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని కోరుకుంటున్నాడు. ‘నేను చెప్పేది పాటించండి.. హాయిగా జీవించండి’ అని తన వీడియో ద్వారా సందేశాన్నిచ్చాడు. అదే సమయంలో తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించాడు. 'జై హింద్, జై భారత్' అంటూ పాట ముగించాడు. ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ అతని పాటకు పూర్తిగా ఫిదా అయ్యామని, అందుకు 10కి 10 మార్కులు ఇవ్వొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులే మాకు కావాల్సింది అంటూ అతనికి సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ రణవీర్ కూడా చూశాడో, లేదో తెలియాలి! -
అంపైర్ హెల్మెట్ ధరించిన వేళ..
మెల్ బోర్న్:క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్లు హెల్మెట్ ధరించటం చాలా అరుదైన విషయమే. సాధారణంగా బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, డేంజర్ జోన్లలో ఫీల్డింగ్ చేసే వారే ఎక్కువగా హెల్మెట్ తో కనిపిస్తారు. అయితే మోడ్రన్ క్రికెట్ లో వచ్చిన మార్పులతో అంపైర్లు కూడా హెల్మెట్ ధరించడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాట్స్ మెన్ బంతిని బాదుతున్న తీరు కూడా అంపైర్లకు హెల్మెట్ తప్పనిసరి అని హెచ్చరికలు పంపిస్తోంది. ఇటీవల భారత్‌లో పంజాబ్-తమిళనాడుల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ సందర్బంగా ఆస్ట్రేలియాన్ అంపైర్ జాన్ వార్డ్ కు తలకు బంతి తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం మెల్ బోర్న్-పెర్త్ స్కార్చెర్స్ ల మధ్య ఇథిహాడ్ స్టేడియంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో అంపైర్ గెరాడ్ అబూద్ హెల్మెట్‌ను ధరించాడు. దీంతో హెల్మెట్ ను ధరించిన తొలి ఆస్ట్రేలియన్ అంపైర్ గా గెరాడ్ గుర్తింపు పొందాడు. తన సహచర అంపైర్ జాన్ వార్డ్ కు బంతి తగలడంతోనే హెల్మెట్ ధరించాలని బలంగా నిశ్చయించుకున్నట్లు గెరాడ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా గతేడాది ఇజ్రాయిల్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హిల్లెల్ అవాస్కర్ అంపైరింగ్ చేస్తూ బంతి బలంగా తగలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
వారికి హెల్మెట్ అవసరం లేదా?
న్యూఢిల్లీ: హెల్మెట్ ధరించకుండా సిక్కు మహిళలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మోటారు వాహనాల చట్టం నుంచి వారికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని అడిగింది. మహిళలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై చీఫ్ జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. సిక్కు మహిళలకు హెల్మెట్ అవసరం లేదని భావిస్తున్నారా, వీరికి మినహాయింపునిస్తూ సవరణ చేయడం వెనుకున్న కారణమేంటని ఢిల్లీ నగర పాలక సంస్థను న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 12కు వాయిదా వేసింది.