హ్యపీ బర్త్‌డే డార్లింగ్‌ ప్రభాస్‌..

Hyderabad City Police Tweet About Wearing Helmet With Prabhas Picture - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌  బ్యాచిలర్‌ లిస్ట్‌లో ముందుండే పేరు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. 2002లో ఈశ్వర్‌ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్‌ నేటి వరకు 19 సినిమాలు చేశాడు. ప్రస్తుతం రాధే శ్యామ్‌ సినిమా చేస్తున్నాడు. బాహుబలి వంటి భారీ చిత్రంలోని తన నటనతో కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అంతులేని అభిమానులను సంపాదించుకున్నాడు. నేడు డార్లింగ్‌ ప్రభాస్‌ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో అభిమానులు భారీగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పరిచి బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. అయితే పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే రాధే శ్యామ్‌ సినిమా నుంచి వివక్రమాదిత్యగా ప్రభాస్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్‌ ఈ రోజు మధ్యాహ్నం 12.02 గంటలకు బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్‌ విడుదల చేయనున్నారు. ఈ సర్‌ప్రైజ్‌ ఎలా ఉండబోతుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘రాధేశ్యామ్’ సర్‌ప్రైజ్‌.. ప్రభాస్‌ లుక్‌ అదుర్స్‌

ఇక ప్రభాస్‌కు దేశం నలుమూలలా నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘హ్యపీ బర్త్‌డే డార్లింగ్‌ ప్రభాస్‌’ అంటూ ట్విటర్‌లో ట్రెండ్‌ క్రియెట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రబాస్‌ పెద్దనాన్న(కృష్ణం రాజు) కూతురు ప్రసీధ.. అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘నా అభిమాన హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.  మీరు ఎల్లప్పుడూ ఇలా ప్రేమగా ఉండి రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను అందుకోవాలి అన్నయ్య, మీ నుంచి ఎల్లప్పుడూ నేర్చుకోవటానికి చాలా సంతోషిస్తున్నాను. లవ్ యూ’. అంటూ ట్వీట్‌ చేశారు. చదవండి: ప్రభాస్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మహేష్‌ బాబు, వరుణ్‌ తేజ్‌,నటి రాశీ ఖన్నా, నిర్మాత  బీఏ రాజు, బండ్ల గణేష్‌, గోపిచంద్‌ మలినేని, బాబీ, మెహర్‌ రమేష్‌, సరేందర్‌ రెడ్డి.. హ్యపీ బర్త్‌డే ప్రభాస్‌.. జీవితాంతం సంతోషంగా ఉండాలని, భవిష్యత్తుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌ సిటీ పోలీసులు సైతం సినిమా పోస్టర్‌లను ఉపయోగించి ట్రాఫిక్‌ నిబంధనలను, జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటించిన మిర్చి సినిమాలోని బైక్‌పై హెల్మెట్‌ ధరించిన ఫోటోతో సందేశం ఇచ్చారు. ‘నీ మీద మీ జీవితమే కాదు.. మీ కుంటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయ్‌. హెల్మెట్‌ ధరించండి.’ అని ట్వీట్‌ చేశారు. చదవండి: వరదలు : ప్రభాస్‌ భారీ విరాళం

కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో మళ్లీ మొదలైంది. రాధే శ్యామ్ సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top