breaking news
voonik
-
కష్టాల్లో ఉన్నాం, మూడు నెలల జీతాలు మర్చిపోండి!
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ రీటైలర్ స్నాప్‌డీల్ ఖర్చులను , నష్టాలను తగ్గించుకునే పనిలో భాగంగా భారీగా ఉద్యోగులపై వేటు వేస్తే .తాజాగా మరో కంపెనీ ఈ కోవలోకి చేరింది. ఫ్యాషన్ రిటైలర్ వూనిక్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ‘హర్ దిన్ ఫ్యాషన్ కరో’ నినాదంతో ఫ్యాఫన్ ప్రపంచంలోకి దూసుకొచ్చిన వూనిక్ తాజా నిర్ణయంతో సంస్థ ఉద్యోగులు డేంజర్ జోన్లో పడ్డారు. సుమారు 200 మంది ఉద్యోగులకు మూడు నెలలపాటు జీతాలు ప్రస్తుతానికి చెల్లించలేమని చేతులెత్తేసింది. అంతేకాదు అధిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులను తొలగించనుంది. టీం పునర్నిర్మాణంలో భాగంగా కొంతమందిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగుల నిర్మాణంలో మార్పులు చేస్తున్నామనీ, అందుకే ఈ నిర్ణయమని వూనిక్ సీఈవో, కో ఫౌండర్ సుజయత్ ఆలీ సోమవారం ఒక సమావేశంలో చెప్పారు. గతంలో కూడా ఇలాంటి చర్య తీసుకున్నామని చెప్పారు. అయితే వాయిదా వేసిన వేతనాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు. కంపెనీనీ వీడిన ఉద్యోగులకు ఒకనెల జీతాన్ని చెల్లిస్తామని కంపెనీ సీఈవో వెల్లడించారు. ఎబిటా మార్జిన్లు బాగా పడిపోయాయని పేర్కొన్నారు. దీంతోపాటు సంస్థలో పనిచేస్తున్న 350మంది ఉద్యోగుల్లో కొంతమందిపై వేటు వేయనుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్టు విభాగంలోని వారిని తొలగిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (రూసీ) తో దాఖలు చేసిన కంపెనీ రికార్డు ప్రకారం, వూనిక్ నష్టాలు పద్దెనిమిది రెట్లు పెరిగాయి. గత ఏడాది వరకు నియామకాల్లో, మార్కెటింగ్, ప్రకటనల్లో జోరుగా భారీ మొత్తాలను ఖర్చు చేసిన వూనిక్ ఈ మధ్య కాలంలో ఇబ్బందుల్లో పడింది. అయితే కంపెనీ ఖర్చులను చాలా వరకు తగ్గించుకుందని సంస్థ సీఈవో అలీ చెప్పినప్పటికీ, కంపెనీలో భవిష్యత్తు అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని సీనియర్ స్థాయి ఉద్యోగులు కంపెనీని సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం!
• ఒకే వేదికగా 20 వేల రిటైలర్లు, 15 లక్షల ఉత్పత్తులు • మహిళలకు వూనిక్; పురుషులకు మిస్టర్ వూనిక్ • డిసెంబర్లో విలారా పేరిట మరో స్టార్టప్ • ఇప్పటికే రూ.184 కోట్ల నిధుల సమీకరణ • రూ.660 కోట్ల జీఎంవీ; టర్నోవర్ రూ.80 కోట్ల్లు • రెండేళ్లలో ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలకూ విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫ్యాషన్‌ను అనుకరిస్తే నలుగురిలో ట్రెండీగా కనిపించొచ్చు! అదే ఫ్యాషన్స్‌పై ఇష్టం పెంచుకుంటే? ట్రెండీతో పాటూ ఆదాయాన్ని ఆర్జించొచ్చు!! ...ఇదే వూనిక్ ఫౌండర్ల వ్యాపార సూత్రం. మహిళా ఫ్యాషన్ పోర్టల్‌గా ప్రారంభమైన వూనిక్.. పురుషుల కోసం మిస్టర్ వూనిక్గా విస్తరించింది. దేశంలోని ఇతర ఫ్యాషన్ స్టార్టప్స్ ఆరింటిని కొనుగోలు చేసే స్థాయికీ ఎదిగింది. విదేశాలకూ ఫ్యాషన్ పాఠాలను నేర్పే దిశగా ఆడుగులేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వూనిక్.. ఓ ఫ్యాషన్ ప్రపంచం! రూ.40 లక్షల పెట్టుబడితో 2013లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన వూనిక్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సుజాయత్ అలీ, నవనీత కృష్ణన్లు ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. పెట్టుబడుల్లేవ్.. గిడ్డంగులూ లేవ్ ఎలాంటి పెట్టుబడులు, గిడ్డంగులు లేకుండానే వందల కోట్ల వ్యాపారాన్ని చేస్తోంది వూనిక్. ఇది కే వలం ఫ్యాషన్ ప్రియులను, రిటైలర్లు కలిపే ఒక వేదిక. మ్యాడ్స్టాక్ టెక్నాలజీ ద్వారా పనిచేయడమే వూనిక్ ప్రత్యేకత. అంటే వెబ్సైట్లో ఉత్పత్తులను చూడటంతో పాటూ మన శరీరానికి వేసుకుంటే ఎలా ఉంటుందో కళ్లతో చూసుకునే వీలుంటుంది కూడా. అలాగే మన శరీరాకృతి, రంగును చెబితే చాలు మనకెలాంటి దుస్తులు నప్పుతాయో సూచిస్తారు. ‘హర్ దిన్ ఫ్యాషన్ కరో’ నినాదంతో ఈ ఏడాది ప్రారంభంలో తొలి టీవీ క్యాంపెయిన్‌ను ప్రారంభించాం. దీనికి ప్రముఖ బాలీవుడ్ డెరైక్టర్ ఫరాఖాన్ లీడ్ రోల్ నిర్వహించారు. ఏటా రూ.660 కోట్ల జీఎంవీ.. ప్రస్తుతం మా వెబ్సైట్లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. 10 లక్షల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. రోజుకు 25 వేల ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులో నాలుగో వంతు వాటా దక్షిణాది రాష్ట్రాలదే. ప్రస్తుతం మా సంస్థలో 20 వేల రిటైలర్లు నమోదయ్యారు. 15 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. ప్రతి కొనుగోలు మీద 20% కమీషన్ రూపంలో తీసుకుంటాం. మా భాగస్వామ్య సంస్థలకు ఏడాదికి రూ.660 కోట్లు (100 మిలియన్ డాలర్లు) గ్రాస్ మర్చంటైస్ వాల్యూ (జీఎంవీ) జరుగుతోంది. ఇందులో రూ.80 కోట్లు (12 మిలియన్ డాలర్లు) కమీషన్ రూపంలో వస్తుంది. ఇదే మా టర్నోవర్. డిసెంబర్లో విలారా ప్రారంభం.. జూన్‌లో పురుషుల కోసం మిస్టర్ వూనిక్ను ప్రారంభించాం. ఇందులో 1,500 మంది అమ్మకందారులు, 2 లక్షల మంది యూజర్లు నమోదయ్యారు. డిసెంబర్లో విలారా పేరిట మరో స్టార్టప్‌ను ప్రారంభించనున్నాం. మహిళలు, పురుషులు ఇద్దరికీ ప్రీమియం డిజైనర్ దుస్తుల విభాగం. మార్కెటింగ్, రిటైలర్లతో ఒప్పందాల కోసం 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు కూడా. ‘‘గతేడాది ఆగస్టులో ట్రయల్కార్ట్ కొనుగోలుతో మొదలైన మా ప్రయాణం.. గెట్సీ, స్టయిల్, పిక్సిల్క్, జోహ్రా, డెక్కాన్ల వరకు సాగింది. వచ్చే రెండేళ్లూ టెక్నాలజీ స్టార్టప్స్ కొనుగోళ్లపై దృష్టిసారిస్తాం. రూ.184 కోట్ల నిధుల సమీకరణ.. ఇప్పటిదాకా వూనిక్ రూ.184 కోట్లు(28 మిలియన్ డాలర్లు) సమీకరించింది. ఇందులో సికోయా క్యాపిటల్, టైమ్స్ ఇంటర్నెట్, బీనస్, బీనెక్ట్స్, పార్క్‌వుడ్ బెస్పిన్, టాన్కాన్, ఫ్రీచార్జ్ కునాల్ షా ఉన్నారు. ప్రస్తుతం మా సంస్థలో 500 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ రఘు లక్కప్రగడ సీఓఓగా, మింత్ర సీఎఫ్ఓ ప్రభాకర్ సుందర్ లీడ్ ఫైనాన్స్ గా ఉన్నారు. వచ్చే 12 నెలల్లో 300 మిలియన్ డాలర్ల జీఎంవీని చేరాలన్నది లక్ష్యం. ఆ తర్వాతే మరో విడత నిధుల సమీకరణ చేస్తాం. రెండేళ్లలో ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలకూ వూనిక్ సేవలను విస్తరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...