breaking news
Vodafone Red Postpaid Subscribers
-
వొడాఫోన్ ఆ ప్లాన్‌పై 30జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వొడాఫోన్ ఇండియా కూడా తన ప్లాన్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్ల కొత్త రెడ్ ప్లాన్‌ను వొడాఫోన్ అప్డేట్ చేసింది. ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్, 100 ఎస్ఎంఎస్లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. ఇతర ప్లాన్స్ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్ రెడ్‌ప్లాన్ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి. తొలుత వొడాఫోన్ రెడ్ సబ్స్క్రైబర్లు రూ.399 ప్లాన్‌ను పొందడానికి తమ మొబైల్ హ్యాండ్సెట్ల నుంచి 199కి కాల్ చేయాల్సి ఉండేది. అయితే అధికారిక వొడాఫోన్ సైట్ మాత్రం ఈ కొత్త ప్లాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంది. ప్రస్తుత ప్లాన్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, జమ్ము అండ్ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ సర్కిళ్లలో అందుబాటులో లేదు. గతేడాది నవంబర్‌లో వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్లకు ఈ రూ.399ల రెడ్ బేసిక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అప్పుడు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, 10జీబీ డేటాను ఆఫర్ చేసేంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించలేదు. అనంతరం ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసి డేటా పరిమితిని 20జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ డేటాను మరో 10జీబీ పెంచి, 30జీబీ చేసింది. జియో తన రూ.309 పోస్టు పెయిడ్ప్లాన్పై 30జీబీ డేటాను, ఎయిర్టెల్ తన రూ.399 మైఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్‌పై 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. -
వొడాఫోన్ బంపర్ ఆఫర్: వారికి ఫ్రీ డేటా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వొడాఫోన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద మహిళా సబ్స్క్రైబర్లందరికీ ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్టు వొడాఫోన్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందిచనుంది. సబ్ స్క్రైబర్ ప్లాన్ కు 2జీబీ ఉచిత డేటా ఆటోమేటిక్ గా యాడ్ అవుతుందని, మహిళలకు ఈ విషయం టెస్ట్ మెసేజ్ ద్వారా తెలుపుతామని కంపెనీ వివరించింది. ఒకవేళ టెస్ట్ మెసేజ్ ద్వారా ఈ ఉచిత గిఫ్ట్ ను అందుకోలేని వారు దగ్గర్లోని వొడాఫోన్ స్టోర్ ను సంప్రదించాల్సిందిగా కంపెనీ తెలిపింది. వర్క్ ప్లేస్‌లో మహిళలకు తమ సంస్థ సమాన అవకాశాలు కల్పిస్తుందని తాము నమ్ముతున్నట్టు వొడాఫోన్ ఇండియా ఢిల్లీ-ఎన్సీఆర్ బిజినెస్ హెడ్ అలోక్ వర్మ తెలిపారు. తమ పురుష కస్టమర్లు మాదిరిగానే మహిళా కస్టమర్లు కూడా మొబైల్ ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడుతున్నట్టు తమ డేటా అనాలిస్ట్ లో గుర్తించామన్నారు. ఈ ఆఫర్ మహిళలు జీవితంలో మరింత సాధించేలా తమ ప్రయత్నాలను పునరుద్ధాటిస్తుందన్నారు. కాగ జనవరి నెలలో వొడాఫోన్, రిలయన్స్ జియోకు కౌంటర్ గా అపరమిత కాల్స్, ఎక్కువ డేటాను అందిస్తూ రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.499 నుంచి రూ.1,999 వరకు ఉన్నాయి. రూ.2999 ప్లాన్ కింద ఎంపికచేసిన నగరాల్లో హోమ్ నెట్ వర్క్ పై అపరిమిత కాల్స్, రోమింగ్ అందిస్తోంది. 100 టెస్ట్ మెసేజ్ లు, 40జీబీ 4జీ/3జీ డేటాను 4జీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కల్పిస్తోంది.