breaking news
viyatnam forest
-
చైనాకు ధీటుగా మరో కట్టడం.. అబ్బురపరుస్తున్న వీడియో
ప్రపంచంలోని ఎన్నో వింతల్లో మరో విశేష కట్టడం చేరబోతోంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించేందుకు వియత్నాం వేదికైంది. ప్రపంచంలోనే అతిపొడవైన గాజు వంతెనను వియత్నాంలోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో నిర్మించారు. ఈ గాజు వంతెన పొడవు 2,073.5 అడుగులు ఉండగా.. భూమి నుంచి వంతెన ఎత్తు సుమారుగా 500 అడుగుల ఎత్తులో ఉంది. కాగా, ఈ వంతెనను ఏప్రిల్ 30వ తేదీన ఓపెన్ చేయబోతున్నారు. ఈ వంతెనపై ఇప్పటికే అధికారులు భద్రతను పరిశీలించారు. అనంతరం సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఈ గాజు వంతెన అధికారిక పొడవు ప్రపంచంలోనే ఎక్కువగా ఉండటంతో వంతెన గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు సమర్పించినట్లు తెలిపారు. ఇక, ఈ వంతెనపైకి ఒక్కసారి 500 మంది మాత్రమే నడవడానికి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ వంతెన నిర్మాణానికి ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన సూపర్ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఇక, చైనాలో కూడా ఓ గాజు వంతెనను నిర్మించిన విషయం తెలిసిందే. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవుతో గాజు వంతెన ఉంది. ఈ వంతెన ప్రస్తుతం పొడవైనదిగా గిన్నిస్ రికార్డుల్లో ఉంది. కాగా, ఈ వంతెనను 2016లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వంతెనకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. -
అంతరించే దశలో అరుదైన కుందేలు
లండన్: లావోస్, వియత్నాం అడవుల్లో నివసించే అరుదైన జాతికి చెందిన చారల కుందేలు ప్రస్తుతం అంతరించే దశలో ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అన్నామైట్ చారల కుందేలును పరిశోధకులు 1999లో గుర్తించారు. నాటినుంచి ఇప్పటివరకు ఇది చాలా తక్కువసార్లు మాత్రమే కనిపించింది. ఇటీవల దీన్ని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ) పరిశోధకులు కనుగొన్నారు. ఈ అరుదైన కుందేలు చరిత్రను తెలుసుకునేందుకు యూఈఏకు చెందిన సారా అనే పరిశోధకురాలు మూడు నెలలపాటు అధ్యయనం కొనసాగించింది. ఇతర కుందేళ్లతో పోల్చితే ఈ కుందేళ్లు జన్యుపరంగా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అయితే పెరిగిపోయిన జంతువుల వేట, అడవుల నిర్మూలన వల్ల ఇది అంతరించే ప్రమాదమున్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అరుదైన జీవులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడింది.